హైదరాబాద్‌లో విషాదం
ABN , First Publish Date - 2020-11-27T12:35:48+05:30 IST
నగర శివారు రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్: నగర శివారు రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. పాండురంగ నగర్‌లో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా విద్యార్థిని మృతిపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని మృతిలో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.