హైదరాబాద్: ట్రాన్స్‌పోర్ట్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2020-11-15T15:35:19+05:30 IST
సాయినాథ్ గంజ్ పోలీసుస్టేషన్ పరిధి బేగంబజార్‌లోని నవభారత్ ట్రాన్స్‌పోర్ట్ గోదాంలో గత అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: సాయినాథ్ గంజ్ పోలీసుస్టేషన్ పరిధి బేగంబజార్‌లోని నవభారత్ ట్రాన్స్‌పోర్ట్ గోదాంలో గత అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి పండుగ సందర్భంగా తరాజువ్వలు గోదాంలోని కేబుల్ వైర్లపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సాయినాథ్ గంజ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను రెండు ఫైర్ ఇంజన్లతో అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని... గోదాం యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు యజమాని పేర్కొన్నారు.