హైదరాబాద్: లాడ్జ్‌లో పేకాట రాయుళ్ల అరెస్ట్
ABN , First Publish Date - 2020-11-15T13:19:51+05:30 IST
నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జ్‌లో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జ్‌లో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయత్రి లాడ్జ్‌లో 11 మంది పేకాట రాయుళ్ళు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.14 నగదు, ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.