హైదరాబాద్‌లో రాజస్థాన్ ఏటీఎస్ టీమ్ సోదాలు

ABN , First Publish Date - 2020-10-12T13:13:12+05:30 IST

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో రాజస్థాన్ ఏటీఎస్ టీమ్ నగరంలో సోదాలు నిర్వహించింది.

హైదరాబాద్‌లో రాజస్థాన్ ఏటీఎస్ టీమ్ సోదాలు

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో రాజస్థాన్ ఏటీఎస్ టీమ్ నగరంలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ , ముంబై , ఢిల్లీ, రాజస్థాన్ కేంద్రంగా  క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్నట్లు ఏటీఎస్ బృందం గుర్తించింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఏడుగురు సభ్యుల నుంచి దాదాపు రూ.16 కోట్ల నగదును స్వాధీనం చేశారు. ఈ ముఠా సైబరాబాద్ పరిధిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు ఏటీఎస్ బృందం తెలిపింది. ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న గణేష్‌ను అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణేష్,  సురేష్ , పంకజ్, సత్తయ్యతో పాటు మరో ముగ్గురిని  అరెస్టు చేశారు.  ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా అతిపెద్ద క్రికెట్ బెట్టింగ్ జరుగుతోంది. గణేష్ అన్ని రాష్ట్రాల్లో ముఠాలను ఏర్పాటు చేసి బెట్టింగ్‌‌లు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-10-12T13:13:12+05:30 IST