టిమ్స్‌ ఆస్పత్రి ముందు కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్సుల ఆందోళన

ABN , First Publish Date - 2020-11-21T10:27:13+05:30 IST

టిమ్స్‌ ఆస్పత్రి ముందు కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్సుల ఆందోళన

టిమ్స్‌ ఆస్పత్రి ముందు కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్సుల ఆందోళన

 మియాపూర్‌, నవంబర్‌ 20(ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని కొవిడ్‌-19 టిమ్స్‌ ఆస్పత్రి వద్ద శుక్రవారం దాదాపు 200మంది కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్సులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు చెప్పిన నిబంధనలను టిమ్స్‌ ఆస్పత్రి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆందోళన చేపట్టారు. ఉద్యోగంలో చేరేటప్పుడు ఏడు రోజులు విధులు... ఏడు రోజులు హోంక్వారంటైన్‌ ఐసోలేషన్‌ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు వారానికి ఓ సారి హోంక్వారంటైన్‌ ఇస్తామని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.


‘నెలకు నాలుగు రోజులు మాత్రమే హోంక్వారంటైన్‌ సెలవులు ఇచ్చి మీగత 26రోజులు పనిచేయడం వల్ల మేం, మా కుటుంబ సభ్యులు కరోనా బారిన పడితే ఎవరు బాధ్యులు’అని వారు ప్రశ్నించారు. జీతాలు కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని అందుకే తాము ఆందోళన చేస్తున్నామని స్టాఫ్‌నర్సులు పేర్కొన్నారు.  

Read more