భారత్ దర్శన్’ రైలు వచ్చేస్తోంది..!
ABN , First Publish Date - 2020-11-21T10:15:12+05:30 IST
కొవిడ్-19 కారణంగా రద్దయిన భారత్ దర్శన్ రైలు మళ్లీ పట్టాలెక్కనుంది. ఈ మేరకు డిసెంబర్‌లో దక్షిణభారత దేశంలో ఆరు రోజుల యాత్రను నిర్వహించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) అధికారులు ఏర్పాట్లు చేశారు. ..

వచ్చే నెలలో ఐఆర్‌సీటీసీ దక్షిణ భారతయాత్ర ప్రారంభం
హైదరాబాద్ సిటీ, నవంబర్ 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్-19 కారణంగా రద్దయిన భారత్ దర్శన్ రైలు మళ్లీ పట్టాలెక్కనుంది. ఈ మేరకు డిసెంబర్‌లో దక్షిణభారత దేశంలో ఆరు రోజుల యాత్రను నిర్వహించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) అధికారులు ఏర్పాట్లు చేశారు.
డిసెంబర్ 12న రైలు ప్రారంభం..
దక్షిణభారత్ యాత్రలో భాగంగా డిసెంబర్ 12 నుంచి భారత్‌దర్శన్ రైలు ప్రారంభంకానుంది. స్లీపర్ 12 బోగీలు, ఏసీ త్రీ టైర్-1, ప్యాంట్రీ కార్-1 కలిగిన రైలులో కొవిడ్ జాగ్రత్తలను పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
సంప్రదించాల్సిన నంబర్లు..
దక్షిణ భారతయాత్రను పర్యటించేందుకు ఆసక్తి కలిగిన వారు కింది నంబర్లకు ఫోన్ చేసి బుకింగ్‌లు చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. బుకింగ్‌లకు ఐఆర్‌సీటీసీ జోనల్ కార్యాలయం సికింద్రాబాద్ 040-27702407, 9701360701, 8287932227 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చన్నారు.
ప్యాకేజీ ధరలు..
స్లీపర్ క్లాస్: రూ.7,140(ఒక్కొక్కరికి)
ఏసీ త్రీ టైర్ క్లాస్: రూ.8,610(ఒక్కొక్కరికి) .