పొట్లపల్లి సాహిత్య పురస్కారం

ABN , First Publish Date - 2020-11-21T10:09:50+05:30 IST

ప్రముఖ కవి, అభ్యుదయవాది, స్వాతంత్య్రసమరయోధుడు పొట్లపల్లి రామారావు జయంతి సందర్భంగా ప్రముఖ కవి జూకంటి జగన్నాథం, సత్యోదయ్‌లకు ‘‘పొట్లపల్లి రామారావు సాహిత్యపురస్కారం

పొట్లపల్లి సాహిత్య పురస్కారం

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, అభ్యుదయవాది, స్వాతంత్య్రసమరయోధుడు పొట్లపల్లి రామారావు జయంతి సందర్భంగా ప్రముఖ కవి జూకంటి జగన్నాథం, సత్యోదయ్‌లకు ‘‘పొట్లపల్లి రామారావు సాహిత్యపురస్కారం -2020’’ను పొట్లపల్లి వరప్రసాద్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు ప్రకటించారు. జానపద కళారూపాలను పరిరక్షించడం, కళాకారులు, రచయితలను ప్రోత్సహించడం లో భాగంగా పొట్లపల్లి వరప్రసాద్‌ ఫౌండేషన్‌ సాహిత్య అవార్డు ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ఆదిత్యరామ్‌, రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రముఖ కవి, కథకుడు జూకంటి జగన్నాథంకి జీవనసాఫల్య పురస్కారం, ‘వ్యతిరిక్త ప్రవాహం’ కవితా సంకలనానికిగాను కవి సత్యోదయ్‌కి పొట్లపల్లి రామారావు సాహితీ అవార్డుతోపాటు ఒక్కొక్కరికీ రూ. 25 వేలు నగదు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్‌ ప్రతినిధులు వివరించారు.

Read more