మానవ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలి
ABN , First Publish Date - 2020-12-28T06:28:47+05:30 IST
సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. ఆదివారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో కళానిలయం, ఇభూసి పోశంపటేల్ మెమోరియల్ ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘మహిళలు- మానవ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు.

జస్టిస్ చంద్రయ్య
అఫ్జల్‌గంజ్, డిసెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. ఆదివారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో కళానిలయం, ఇభూసి పోశంపటేల్ మెమోరియల్ ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘మహిళలు- మానవ హక్కులు’’ అంశంపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి జస్టిస్ చంద్రయ్య ముఖ్యఅతిగా పాల్గొనగా మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాంచందర్‌రావులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తన కోసం తాను జీవించే వాడు ఈగకన్నా హీనమైనవాడని అన్నారు. ఇతరుల కోసం జీవించే వారు హిమాలయాల కంటే గొప్పవారని అభివర్ణించారు. సభానంతరం జస్టిస్ చంద్రయ్యను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళానిలయం సురేందర్, పుష్పలత పాల్గొన్నారు.