నాయిని సతీమణి మృతిపై హోంమంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2020-10-27T13:53:41+05:30 IST

తెలంగాణ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి సతీమణి అహల్య

నాయిని సతీమణి మృతిపై హోంమంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి సతీమణి అహల్య మరణించడంపై హోంశాఖ మంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదు రోజుల వ్యవధిలోనే నాయిని, ఆయన సతీమణి మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతదేహాన్ని చూడడానికి వచ్చిన ఆయన సతీమణి వైద్యుల సలహా మేరకు కొద్దిసేపట్లోనే ఆస్పత్రికి  వెళ్లారని, ఆరోగ్యంగా తిరిగి వస్తారని భావించానని, ఆమె కూడా ఆకస్మికంగా మృతి చెందడం ఊహించలేదని హోంమంత్రి హోంమంత్రి మహమూద్ అలీ సంతాపం తెలియజేశారు.

Updated Date - 2020-10-27T13:53:41+05:30 IST