మహోన్నత ఆధ్యాత్మిక గ్రంథం నన్నేలు నాస్వామి ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-03-12T09:29:40+05:30 IST

ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్ర అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్‌ రచించిన నన్నేలు నా స్వామి ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ కార్యక్రమం ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని శ్రీత్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా వి.ఎస్‌.జనార్థమూర్తి తెలిపారు.

మహోన్నత ఆధ్యాత్మిక గ్రంథం నన్నేలు నాస్వామి ఆవిష్కరణ

చిక్కడపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్ర అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్‌ రచించిన నన్నేలు నా స్వామి ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ కార్యక్రమం ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని శ్రీత్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా వి.ఎస్‌.జనార్థమూర్తి తెలిపారు. బుధవారం గానసభలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సమక్షంలో ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్థన్‌, కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-12T09:29:40+05:30 IST