హిందీ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలి: హిందీ పరిరక్షణ సమితి

ABN , First Publish Date - 2020-12-16T04:47:26+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 25 ప్రకారం హిందీ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని టీఆర్‌టీ 2017హిందీ జీవో ఎంఎస్‌ నెంబర్‌ 25 పరిరక్షణ సమితి డిమాండ్‌

హిందీ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలి: హిందీ పరిరక్షణ సమితి
సమావేశంలో మాట్లాడుతున్న హిందీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పి సత్యనారాయణ

బర్కత్‌పుర, డిసెంబర్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 25 ప్రకారం హిందీ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని టీఆర్‌టీ 2017హిందీ జీవో ఎంఎస్‌ నెంబర్‌ 25 పరిరక్షణ సమితి డిమాండ్‌ చేసింది, మంగళవారం బషీర్‌బాగ్‌ప్రె్‌సక్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి సత్యనారాయణ, ప్రధానకార్యదర్శి ఎం యాదగిరి, ఉపాధ్యక్షులు హుస్సేన్‌సాబ్‌లు మాట్లాడుతూ 17 మాసాలుగా హిందీ ఉపాఽధ్యాయులు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌కోసం ఎదురుచూస్తున్నారని వారు పేర్కొన్నారు. జీవో 25 ప్రకారం హిందీ ఉపాధ్యాయులను నియమించి తగున్యాయం చేయాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పరిరక్షణ సమితి ప్రతినిఽధులు వి.ప్రవీణ్‌, గీత, మహ్మద్‌అప్జల్‌, ఖాదర్‌ఫాషా, టి.నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T04:47:26+05:30 IST