హైకోర్టు పరిసరాల్లో ఆంక్షలు
ABN , First Publish Date - 2020-03-13T09:46:41+05:30 IST
హైకోర్టు పరిసరాల్లో 144 సెక్షన్‌తోపాటు ఆంఽక్షలను విధిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. హైకోర్టు కార్యకలాపాలు సజావుగా సాగడానికి పరసరాలు, రద్దీ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు రెండు నెలలపాటు అమలు చేయనున్నారు.

రెండు నెలలపాటు అమలు
మార్చి 15 నుంచి మే 13వ తేదీ వరకు
హైదరాబాద్ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు పరిసరాల్లో 144 సెక్షన్‌తోపాటు ఆంఽక్షలను విధిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. హైకోర్టు కార్యకలాపాలు సజావుగా సాగడానికి పరసరాలు, రద్దీ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు రెండు నెలలపాటు అమలు చేయనున్నారు. హైకోర్టు భవనానికి ఉత్తర దిశలో ఉన్న సిటీ కాలేజీ నుంచి నయాపూల్ రోడ్, దక్షిణం వైపు మదీనా సర్కిల్ నుంచి సిటీ కాలేజీ రోడ్డు, ఘాన్సీబజార్, పటేల్ మార్కెట్, రికాబ్‌గంజ్ వీధులకు వెళ్లే దారులు, నయాపూల్ నుంచి మదీనా సర్కిల్ వరకు, పత్తర్‌గట్టి, మదీనా సర్కిల్ నుంచి హైకోర్టు రోడ్, ముస్లింజంగ్ బ్రిడ్జి నుంచి హైకోర్డు రోడ్, పురానాపుల్- పీటీఓ- సిటీ కాలేజీ క్రాస్ రోడ్, హైకోర్డు రోడ్, మూసాబౌలి, మెహందీ, సిటీ కాలేజీ క్రాస్‌రోడ్- హైకోర్టు రోడ్ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.
నిషేధాజ్ఞలు ఇవి
పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించరాదు, ఐదుగురు అంతకన్నా ఎక్కువమంది గుమికూడరాదు. ఆయుధాలు, బ్యానర్లు, ప్లకార్డులు, లాఠీలు, కత్తులు, కర్రల్లాంటి వస్తువులు తీసుకెళ్లరాదు. నినాదాలు, ప్రసంగాలు యాత్రలు, ర్యాలీలు, ధర్నాలు, ట్రాఫిక్, కోర్టు విధుల నిర్వహణకు ఆటంకం కలిగించే కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. మతపరమైన కార్యక్రమాలు, ర్యాలీలు, ఇతర సభలు, సమావేశాలను డీసీపీ అనుమతి తీసుకుని నిర్వహించుకునే అవకాశం ఉంది.
నిషేధాజ్ఞలు ఈనెల 15వ తేదీ ఉదయం 6 నుంచి మే 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని సీపీ అంజనీకుమార్ ప్రకటించారు.