కొవిడ్‌ పాజిటివ్‌ బాధితులకు హెల్ప్‌లైన్‌

ABN , First Publish Date - 2020-08-16T09:45:23+05:30 IST

కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల కోసం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించనున్నట్టు హబ్సిగూడ వీధి నెంబర్‌ 8లోని స్నేహనగర్‌ సంక్షేమ సంఘం

కొవిడ్‌ పాజిటివ్‌ బాధితులకు హెల్ప్‌లైన్‌

రామంతాపూర్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల కోసం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించనున్నట్టు హబ్సిగూడ వీధి నెంబర్‌ 8లోని స్నేహనగర్‌ సంక్షేమ సంఘం ప్రతినిధులు లయన్‌ రఘురామిరెడ్డి, కె.బాల్‌రెడ్డి, అజయ్‌మోహన్‌ గుప్తా తెలిపారు. కరోనా వైరస్‌ బారిన పడి హోం క్వారంటైన్‌లో ఉన్న బాధితులకు హెల్ప్‌లైన్‌ ద్వారా మానసిక ధైర్యాన్ని కల్పించడంతో పాటు అవసరమైన మందులు, నిత్యావసరాలు అందించనున్నట్టు వారు వెల్లడించారు. అపోలో ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యుడితో ఉచితంగా వైద్య సలహాలు అందిస్తామని పేర్కొన్నారు. కొవిడ్‌ పాజిటివ్‌తో హోం క్వారంటైన్‌లో ఉన్నవారు తమ సేవలను వినియోగించుకునేందుకు 9182186828 హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను సంప్రదించాలని వారు కోరారు.

Updated Date - 2020-08-16T09:45:23+05:30 IST