మానవత్వం చాటుకున్న బండి సంజయ్
ABN , First Publish Date - 2020-12-30T05:58:48+05:30 IST
ఫిట్స్ వచ్చి ఓ మహిళ రోడ్డుపై పడిపోయింది. పక్కనే ఉన్న కుమార్తె ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది.

చందానగర్, డిసెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): ఫిట్స్ వచ్చి ఓ మహిళ రోడ్డుపై పడిపోయింది. పక్కనే ఉన్న కుమార్తె ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. మంగళవారం జహీరాబాద్ నుంచి పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకులతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. చందానగర్ రాగానే రోడ్డుపై పడిపోయిన మహిళను గమనించారు. కారు దిగి ఆమె చేతిలో తాళాలు పెట్టి కోలుకునే వరకు అక్కడే ఉన్నారు. తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారు.