నిరాశ్రయులకు చేయూతనిచ్చేందుకు సేవా సంస్థలు అవసరం

ABN , First Publish Date - 2020-12-28T06:58:44+05:30 IST

జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో యాదాద్రి భువనగి చౌటుప్పల్‌కు చెందిన అమ్మనాన్న అనాథ అశ్రమం లోగో, వెబ్‌సైట్‌ను సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సినీ ప్రముఖులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు.

నిరాశ్రయులకు చేయూతనిచ్చేందుకు సేవా సంస్థలు అవసరం
అమ్మానాన్న అనాథ అశ్రమం లోగోను ఆవిష్కరిస్తున్న ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తదితరులు

సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి

బంజారాహిల్స్‌, డిసెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో  యాదాద్రి భువనగి చౌటుప్పల్‌కు చెందిన అమ్మనాన్న అనాథ అశ్రమం లోగో, వెబ్‌సైట్‌ను సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సినీ ప్రముఖులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరాశ్రయులకు చేయూతనిచ్చేందుకు ఇలాంటి సంస్థల అవసరం చాలా ఉందన్నారు. ముంబైలో మంచి ఉద్యోగం వదిలేసి మదర్‌ థెరిసాను ఆదర్శంగా తీసుకుని సేవ చేసేందుకు శంకర్‌ చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరి అండ ఉండాలన్నారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో అండలేని వారికి తోడ్పాటును అందించేందుకు శంకర్‌ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వర్కింగ్‌ జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి కె. విరాహత్‌ అలీ, గ్రావిటీ ఫిల్మ్స్‌ పారుపల్లి చరణ్‌, విన్ను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T06:58:44+05:30 IST