శివారులో భారీ ట్రాఫిక్ జాం
ABN , First Publish Date - 2020-03-24T09:22:27+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణలో బాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సిటీలోకి వస్తున్న వాహదారులను నగర శివారు కొత్తగూడెం చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది.

వాహనాలను అడ్డుకున్న పోలీసులు
వాహనదారులకు కౌన్సెలింగ్
అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ నియంత్రణలో బాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సిటీలోకి వస్తున్న వాహదారులను నగర శివారు కొత్తగూడెం చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా సోమవారం ఉదయం చాలా మంది ప్రజలు, వాహనదారులు రోడ్లపైకి వచ్చారు. దీంతో ప్రభుత్వం రాత్రి ఏడు గంటల తర్వాత రోడ్లపై ఎవరూ కనిపించవొద్దని ఆదేశాలు జారీ చేస్తూ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనా ఏర్పాట్లు చేసేలా పోలీసులకు ఆదేశాలిచ్చింది.
అయితే శివారు కొత్తగూడెం వద్ద నల్లగొండ వైపు నుంచి నగరానికి పెద్ద ఎత్తున వాహనాలు వస్తుండడంతో పోలీసులు అడ్డుకున్నారు లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత నగరానికి ఎందుకు వస్తున్నారని పలు వాహనదారులను పోలీసులు అ డ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోరా? అని వాహనదారులను ప్రశ్నించారు. మీ మంచి కోసమే పని చేస్తున్న ఇలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ దేవేందర్‌తో పాటు ఎస్‌ఐలు వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారికి నచ్చజెప్పి వాహనాలను వెనక్కి పంపించారు.
కేసులు నమోదు
మన్సూరాబాద్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లం ఘించిన వారిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రోడ్లపైకి ఎవరూ రావొద్దని చెప్పినప్పటికీ ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనదారులు రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలో సుమారు 50 మంది వాహనదారులకు జరిమానాలు విధించినట్లు ఎల్‌బీనగర్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు కూడా మరో 15 వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించారు. సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి కిరాణ దుకాణా లు, కూరగాయల దుకాణాలు, పాలు, పె ట్రోల్ బంకులు మూతపడ్డాయి. పోలీసులు వాహనాల్లో తిరుగుతూ ఆయా దుకాణాలను మూయించారు. ఎల్‌బీనగర్ ఎల్‌పీ టీ మార్కెట్ వద్ద సో మ వారం రాత్రి వరకు సొం త ఊర్లకు వెళ్లేందుకు వాహనాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు కన్పించాయి. పోలీసులు వెళ్లిపోవాలని వారించినా అలాగే ఎదురుచూస్తూ, వాహనాలను ఆపటం కన్పించింది.