హెచ్‌డీసీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని మంత్రి హరీ్‌షరావుకు సీపీఎంవినతి
ABN , First Publish Date - 2020-12-16T04:11:56+05:30 IST
ఈఎ్‌సఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో పనిచేస్తున్న హెచ్‌డీసీ కార్మికులకు రావాల్సిన 16 నెలల వేతనాలు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన 8 నెలల వేతనాలు చెల్లించాలని

రాంనగర్, డిసెంబర్ 15 (ఆంధ్రజ్యోతి) : ఈఎ్‌సఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో పనిచేస్తున్న హెచ్‌డీసీ కార్మికులకు రావాల్సిన 16 నెలల వేతనాలు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన 8 నెలల వేతనాలు చెల్లించాలని, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న 60 మంది కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ మంత్రి టి.హరీ్‌షరావుకు సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఆండ్ హెల్ ్త ఎంప్లాయీస్ యూనియన్ ఈఎ్‌సఐ కమిటీ అధ్యక్షుడు ఎం.శ్రీనివా్‌సలు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. జీతాలు లేకున్నా వీరు లాక్‌డౌన్‌లో పనిచేశారని, వెంటనే బడ్జెట్ విడుదల చేసి జీతాలు ఇవ్వాలని కోరారు. చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.