హాషిష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్టు
ABN , First Publish Date - 2020-12-11T07:09:31+05:30 IST
హాషిష్ ఆయిల్‌ను సరఫరా చేస్తుండగా ఇద్దరిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్, మేడ్చల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
పేట్‌బషీరాబాద్, డిసెంబర్ 10 (ఆంధ్ర జ్యోతి): హాషిష్ ఆయిల్‌ను సరఫరా చేస్తుండగా ఇద్దరిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్, మేడ్చల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.40 వేల విలువ చేసే హాషిష్ ఆయిల్ 2 ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్ పరిధి చింతల్‌కు చెందిన సాయి గిరీష్ (21), షేక్ సోయల్(21) విద్యార్థులు. వీరు గంజాయి తాగేవారు. హాషిష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి తాగడంతోపాటు విక్రయిస్తున్నారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్ ఫేజ్-2 రింగ్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించగా గంజాయి నుంచి తయారు చేసిన ఆయిల్‌ను వైజాగ్ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నామని ఒప్పుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.