ఫోన్‌ హ్యాక్‌ చేసి నగదు స్వాహా

ABN , First Publish Date - 2020-06-18T09:55:25+05:30 IST

సెల్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసి దానిద్వారా ఓ వ్యక్తి బ్యాంక్‌ ఖాతాలోని నగదు మరో ఖాతాకు బదిలీ చేశారు సైబర్‌ నేరగాళ్లు.

ఫోన్‌ హ్యాక్‌ చేసి నగదు స్వాహా

8 రూ. 12 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు


హిమాయత్‌నగర్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసి దానిద్వారా ఓ వ్యక్తి బ్యాంక్‌ ఖాతాలోని నగదు మరో ఖాతాకు బదిలీ చేశారు సైబర్‌ నేరగాళ్లు. ఏఎ్‌సరావ్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఫోన్‌ మాట్లాడుతుండగా హ్యాంగ్‌ అయింది. స్విచ్చాఫ్‌ చేసి ఆన్‌చేశాడు. మొబైల్‌లో బ్యాంక్‌కు సంబంధించిన యాప్‌ లేదని గమనించాడు. అనుమానం వచ్చి ఖాతాను పరిశీలించగా రూ. 12 లక్షలు వేరే అకౌంట్‌కు బదిలీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

Updated Date - 2020-06-18T09:55:25+05:30 IST