పాడుబడ్డ భవనంలో మృతదేహం

ABN , First Publish Date - 2020-12-03T22:51:19+05:30 IST

పాడుబడ్డ భవనంలో మృతదేహం

పాడుబడ్డ భవనంలో మృతదేహం

గుంటూరు: నగరంలో కోబాల్డ్ పేటకు చెందిన సుభాని అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. నగర శివారు మల్లికార్జున పురంలోని పాడుబడ్డ భవనంలో మృతదేహం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా పాడై కనిపించింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత నెల 25 న మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు.

Updated Date - 2020-12-03T22:51:19+05:30 IST