మహిళల రక్షణకు మార్గదర్శక్‌లు

ABN , First Publish Date - 2020-07-20T09:57:54+05:30 IST

ఐటీ కారిడార్‌లో మహిళల రక్షణకు ఎస్‌సీఎ్‌ససీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించిన మార్గదర్శక్‌ కార్యక్రమం

మహిళల రక్షణకు మార్గదర్శక్‌లు

శిక్షణ పూర్తిచేసుకున్న 150 మంది 


హైదరాబాద్‌ సిటీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఐటీ కారిడార్‌లో మహిళల రక్షణకు ఎస్‌సీఎ్‌ససీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించిన మార్గదర్శక్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 11వ బ్యాచ్‌లోని 150 మంది మార్గదర్శక్‌లకు ఆదివారం శిక్షణ పూర్తయింది. మార్గదర్శక్‌లకు ప్రతి శనివారం రెండు గంటల చొప్పున 8 వారాలు వీరికి సైబరాబాద్‌ పోలీసులు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఆన్‌లైన్‌లో వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ నిర్వాహకులు స్వామి బోధమయానంద ‘మానసిక దారుఢ్యం పెంచుకోవడం’పై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పాల్గొని మార్గదర్శక్‌లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌సీఎ్‌ససీ అధ్యక్షుడు కృష్ణ ఏదుల తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-20T09:57:54+05:30 IST