‘గాంధీ’లో పెరుగుతున్న కేసులు

ABN , First Publish Date - 2020-05-27T09:40:25+05:30 IST

ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో 29 మందికి పాజిటివ్‌ రాగా గాంధీ ఆస్పత్రికి తరలించారు.

‘గాంధీ’లో పెరుగుతున్న కేసులు

హడీషరీప్‌/ఎర్రగడ్డ/గచ్చిబౌలి/మల్కాజిగిరి/ చాదర్‌ఘాట్‌/అమీర్‌పేట/ ముషీరాబాద్‌/ మెహిదీ పట్నం/ అఫ్జల్‌గంజ్‌/ మంగళ్‌హాట్‌/ మియాపూర్‌/ రాజేంద్రనగర్‌ /హైదరాబాద్‌ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో 29 మందికి పాజిటివ్‌ రాగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరో ఆరుగురికి నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి చేశారు. ఓపీకి 29 మంది రాగా 9 మందిని అడ్మిట్‌ చేసుకున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో ముగ్గురికి పాజిటివ్‌ రాగా గాంధీకి తరలించారు. మరో ఇద్దరికి నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి చేశారు. ఇంకొకరి రిపోర్టు రావాల్సి ఉందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పరమేశ్వర్‌ నాయక్‌ తెలిపారు.


మల్కాజిగిరిలో మహిళకు పాజిటివ్‌ 

మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన రిటైర్డ్‌ పోలీసు అధికారి భార్య(48)కు కరోనా సోకింది. ఆమె కుమార్తెను చూసేందుకు పాతబస్తీకి ఇటీవల వెళ్లి వచ్చిందని తెలిసింది. కుటుంబ సభ్యులు నలుగురిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. 


మలక్‌పేటలో ఇద్దరికి...

చంచల్‌గూడకు చెందిన యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. అతడికి ప్రైమరీ కాంటాక్టులో ఉన్న ఏడుగురిని, సెకెండరీ కాంటాక్ట్‌లో ఉన్న 9మందిని వైద్యులు గుర్తించి క్వారంటైన్‌కు పంపించారు. ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన వృద్ధుడు అనారోగ్యంతో యశోద ఆస్పత్రికి వెళ్లగా గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. 


పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. వృద్ధుడి ఇంట్లోని ఏడుగురిలో ముగ్గురిని ప్రైమరీ కాంటాక్టులో క్వారంటైన్‌కు పంపగా మిగతా నలుగురిని హోం క్వారంటైన్‌ చేశారు. 


సనత్‌నగర్‌లో ఒకే ఇంట్లో నలుగురికి..

సనత్‌నగర్‌ సుభా్‌షనగర్‌కు చెందిన వృద్ధురాలికి పాజిటివ్‌ రాగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె కుమారుడు, కోడలు, మనువడి నమూనాలను ల్యాబ్‌కు పంపించగా పాజిటివ్‌ వచ్చింది. అధికారులు సుభా్‌షనగర్‌ను కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. 


ముషీరాబాద్‌లో..

ముషీరాబాద్‌ వినోభానగర్‌లో నివసించే వ్యక్తి(48)కి గతంలో పాజిటివ్‌ వచ్చింది. తాజాగా అతడి భార్య(45)కు పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు భోలక్‌ఫూర్‌ యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ మౌనిక తెలిపారు. భోలక్‌పూర్‌లో 9 మంది దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుండగా బేగంపేటలోని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించినట్లు బైబిల్‌హౌస్‌ యూపీహెచ్‌సీ వైద్యాధికారి తెలిపారు.  


మియాపూర్‌లో బాలికకు..

ముంబై నుంచి కారులో వచ్చిన సైదాబాద్‌కు చెందిన ఇద్దరికి పాజిటివ్‌ రాగా వారితోపాటు కారులో వచ్చిన మియాపూర్‌ టేకునర్సింహనగర్‌కు చెందిన బాలికకు పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. ఆమె తల్లి, బంధువును హోం క్వారంటైన్‌లో ఉంచారు. 


పాతబస్తీలో ముగ్గురు పోలీసులకు..

 కామటిపురా, బహదూర్‌పురా, శాలిబండ పోలీ్‌సస్టేషన్లలో పనిచేస్తున్న ముగ్గురు పోలీసులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. శాలిబండలో పాజిటివ్‌ వచ్చిన పోలీసు ఇటీవల వలస కార్మికులను తరలించే విధుల్లో పనిచేశారు. బహదూర్‌పురా పీఎ్‌సకు చెందిన వారు కట్టడి ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. కామటిపురా పీఎ్‌సకు చెందిన పోలీసు నివాసం జియాగూడ కావడంతో అక్కడి నుంచి కరోనా వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.


కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో..

కింగ్‌కోఠి ఆస్పత్రిలోని కరోనా ఓపీకి 97మంది వచ్చారు. 19 మందిని అడ్మిట్‌ చేసుకున్నారు. 27 మంది నమూనాలు సేకరించగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నెగెటివ్‌ వచ్చిన 18 మందిని డిశ్చార్జి చేశారు. 


సరోజినీదేవి ఐసోలేషన్‌లో 12 మంది  

సరోజినీదేవి ఐసోలేషన్‌ వార్డులో 12 మంది ఉన్నట్లు డాక్టర్‌ అనురాధ తెలిపారు. 


జియాగూడలో విజృంభిస్తోన్న మహమ్మారి

జియాగూడ పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి నేటి వరకు 120 మందికి కరోనా సోకింది. 10 మంది చనిపోయారు. 72మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఇందిరానగర్‌, వెంకటేశ్వరనగర్‌, సబ్జిమండి, దుర్గానగర్‌, శ్రీసాయినగర్‌, పనీపూరా తదితర బస్తీలను అధికారులు కట్టడి ప్రాంతాలుగా ప్రకటించారు. వైద్యసిబ్బంది ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. అనుమానం వస్తే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 

Updated Date - 2020-05-27T09:40:25+05:30 IST