అప్పుడు బాబాయ్‌ను.. ఇప్పుడు అబ్బాయ్‌ను..

ABN , First Publish Date - 2020-12-05T16:10:29+05:30 IST

బాబాయ్‌ అబ్బాయ్‌ బరిలో నిలిచారు.

అప్పుడు బాబాయ్‌ను.. ఇప్పుడు అబ్బాయ్‌ను..

హైదరాబాద్‌ : మన్సూరాబాద్‌ డివిజన్‌లో బాబాయ్..‌ అబ్బాయ్‌ బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ తరఫున కొప్పుల విఠల్‌రెడ్డి, బీజేపీ తరఫున కొప్పుల నర్సింహారెడ్డి పోటీలో నిలబడ్డారు. ఓటర్లు మాత్రం అబ్బాయ్‌ నర్సింహారెడ్డిని  గెలిపించారు. ఇద్దరు అభ్యర్థులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. కొప్పుల విఠల్‌రెడ్డి సొంత అన్న కొడుకు నర్సింహారెడ్డి. ఇదిలా ఉండగా.. 2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో కూడా బాబాయ్‌పై అబ్బాయ్‌ బరిలో నిలిచారు. అప్పుడు కూడా విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ తరపున పోటీలో నిలబడగా.. అబ్బాయ్‌ నర్సింహారెడ్డి టీడీపీ తరఫున పోటీలో దిగారు. బాబాయ్‌ 5,949 ఓట్ల మెజార్టీతో అబ్బాయ్‌పై విజయం సాధించారు. 2020 గ్రేటర్‌ ఎన్నికల్లో మాత్రం మన్సూరాబాద్‌ ఓటర్లు అబ్బాయ్‌ని 5419 ఓట్ల మెజార్టీతో గెలిపించడం గమనార్హం.

Updated Date - 2020-12-05T16:10:29+05:30 IST