పాతబస్తీలో మైనర్‌ను పెళ్లి చేసుకున్న వృద్ధుడు
ABN , First Publish Date - 2020-12-30T23:14:22+05:30 IST
పాతబస్తీలో ఓ వృద్ధుడు దారుణానికి తెగబడ్డాడు. మాయమాటలు చెప్పి మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు

హైదరాబాద్: పాతబస్తీలో ఓ వృద్ధుడు దారుణానికి తెగబడ్డాడు. మాయమాటలు చెప్పి మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఖాజీని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి వృద్ధుడు పరారయ్యాడు. కేవలం రూ. 2.50 లక్షల కోసం పిన్ని ఈ ఘాతుకానికి తెగబడింది. వృద్ధుడితో బాలికకు పెళ్లి చేసింది. బాలిక బర్త్ సర్టిఫికెట్‌ను మార్చి పెళ్లి జరిపించింది. ఫలక్‌నుమా పీఎస్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.