‘సామాజిక దూరం’ పాటించని జీహెచ్‌ఎంసీ

ABN , First Publish Date - 2020-03-25T09:46:40+05:30 IST

‘అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. వచ్చినా సామాజిక దూరం పాటించాలి’ అంటూ అవగాహన కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ దాన్ని పాటించడంలో...

‘సామాజిక దూరం’ పాటించని జీహెచ్‌ఎంసీ

  • ఒకే వాహనంలో 40 మంది తరలింపు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ‘అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. వచ్చినా సామాజిక దూరం పాటించాలి’ అంటూ అవగాహన కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ దాన్ని పాటించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఒక్కో డీసీఎంలో 30 నుంచి 40 మంది పారిశుధ్య కార్మికులను ఎక్కించుకొని పని చేసే ప్రదేశాల్లో వదులుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం బీఎన్‌ రెడ్డినగర్‌లో పనిచేసే పారిశుధ్య కార్మికురాలు శారద ప్రమాదవశాత్తు వాహనం నుంచి కింద ప డింది. ఇబ్రహీంపట్నం నుంచి బీఎన్‌ రెడ్డినగర్‌కు వచ్చిన ఆమె దిగకముందే డ్రైవర్‌ వాహనాన్ని నడపడంతో కిందపడి గాయాలయ్యాయి.


కిక్కిరిసి కార్మికులను తీసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌ వద్ద శానిటరీ సూపర్‌ వైజర్లు, ఎస్‌ఎ్‌ఫఏలకు కరోనాపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానూ జీహెచ్‌ఎంసీ సిబ్బంది సా మాజిక దూరాన్ని చెరిపేశారు. అంతేకాదు బల్దియా సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజ రు విధానం నిలిపివేయాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రకటించి నాలుగైదు రోజులైనా ఇంకా అమల్లోకి రాలేదు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అందలేదని సంబంధిత విభాగాలు చెబుతున్నాయి.  

Read more