కిడ్నీ పేషెంట్ అని తెలిసినా.. సెలవు ఇవ్వలేదు.. చివరకు కరోనాతో..
ABN , First Publish Date - 2020-07-08T18:32:48+05:30 IST
జీహెచ్‌ఎంసీలో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి బీపీ, షుగర్‌తో బాధపడుతుండడంతోపాటు కిడ్నీ పేషెంట్.

కిడ్నీ పేషెంట్ అని తెలిసినా.. సెలవివ్వని డిప్యూటీ కమిషనర్
కరోనాతో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ మృతి
వేధిస్తున్నారంటూ కమిషనర్‌కు బిల్ కలెక్టర్ల లేఖ
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీలో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి బీపీ, షుగర్‌తో బాధపడుతుండడంతోపాటు కిడ్నీ పేషెంట్. ప్రతి శనివారం డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, సెలవు ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్‌ను అడగగా.. డ్యూటీకి రావాల్సిందేనన్నారు.
కరోనా బారిన పడిన అతడు మంగళవారం మృతి చెందాడు. గోషామహల్‌లో పనిచేస్తున్న బిల్‌కలెక్టర్లు, అసిస్టెంట్ బిల్‌కలెక్టర్లు సర్కిల్-14 డిప్యూటీ కమిషనర్ వినయ్‌కుమార్‌పై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారు. వినయ్‌కుమార్ సిబ్బందిని వేధిస్తున్నారని, ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోకుండా దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు లేఖలో పేర్కొన్నారు.