ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగికి రెండేళ్ల జైలు

ABN , First Publish Date - 2020-03-21T10:03:16+05:30 IST

లంచంతీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబ డి జైలుపాలైన జీహెచ్‌ఎంసీ ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేసింది.

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగికి రెండేళ్ల జైలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి20 (ఆంధ్రజ్యో తి): లంచంతీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబ డి జైలుపాలైన జీహెచ్‌ఎంసీ ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-6 రాజేంద్రనగర్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బి.కుప్పానాయక్‌ 2013లో బిల్లులు మంజూరు చేసేందుకు రూ.35 వేలు డిమాండ్‌ చేశాడు. బాధితుడు పి.శ్రీధర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు సమాచారమివ్వడంతో అతడిని ఏసీబీ అధికారులు అరె్‌స్ట చేశారు.


కేసు నమోదు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి జస్టిస్‌ సాంబశివరావు నాయుడు నిందితుడికి రెండేళ్ల జైలుతోపాటు, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2019 అక్టోబర్‌ 25న తీర్పు చెప్పారు. తొలిసారి 2013లో ఏసీబీకి చిక్కిన కృపానాయక్‌ 2017లో మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ప్రస్తుతానికి 2013కి సంబంధించిన కేసులో ఏసీబీ కోర్టు శిక్ష విధించింది. మరో రెండు కేసుల విచారణ కొనసాగుతోంది. శిక్ష అనుభవిస్తున్న కుప్పానాయక్‌ను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2020-03-21T10:03:16+05:30 IST