గ్రేటర్‌ పోలింగ్: మొదటి రెండు గంటల్లో 4.5శాతం ఓటింగ్

ABN , First Publish Date - 2020-12-01T15:45:08+05:30 IST

గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా మొదలయ్యాయి. చాలా చోట్ల ప్రముఖులు మొదటి గంటలోనే ఓటేశారు.

గ్రేటర్‌ పోలింగ్: మొదటి రెండు గంటల్లో 4.5శాతం ఓటింగ్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా మొదలయ్యాయి. చాలా చోట్ల ప్రముఖులు మొదటి గంటలోనే ఓటేశారు. కానీ ఇంకా పోలింగ్ ఊపందుకోలేదు. మొదటి రెండు గంటల్లో 4.5శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఉదయం నుంచి వాతావరణం చాలా చల్లగా ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు నెమ్మదిగా వస్తున్నారు. పాతబస్తీలో ఓటరు స్లిప్పులు అందకపోవడంతో  చాలా మంది వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆధార్ ఉన్నా ఓటేసేందుకు అనుమతించలేదు. మరోవైపు పలు చోట్ల టీఆర్ఎస్ ఏజెంట్లు గులాబీ రంగు మాస్క్‌లు ధరించారంటూ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్‌ఈసీకి టీఆర్ఎస్‌పై టీపీసీసీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆర్కేపురం పోలింగ్ బూత్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 

Updated Date - 2020-12-01T15:45:08+05:30 IST