విధ్వంస కుట్రలకు సీఎం శ్రీకారం చుడుతున్నారు.. సంజయ్ ఆరోపణ

ABN , First Publish Date - 2020-11-27T17:26:21+05:30 IST

సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కుట్రదారుల సమాచారం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.

విధ్వంస కుట్రలకు సీఎం శ్రీకారం చుడుతున్నారు.. సంజయ్ ఆరోపణ

హైదరాబాద్: సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కుట్రదారుల సమాచారం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కుర్మగూడ డివిజన్‌లో శుక్రవారం ప్రచారంలో పాల్గొన్న ఆయన.. సీఎం స్క్రిప్ట్‌ను డీజీపీ చదువుతున్నారని విమర్శించారు. ఇది దిక్కుమాలిన చర్యగా వ్యాఖ్యానించారు. సమాచారం ఉంటే అరెస్ట్ చేసి, విధ్వంసాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. రోహింగ్యాలను తరిమికొడతామని, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. భయపెట్టి భయానక వాతావరణం సృష్టించేందుకు సీఎం కుట్ర పన్నారని ఆరోపించారు. విధ్వంసం సృష్టించి... ఆ నింద బీజేపీపై మోపాలని చూస్తున్నారన్నారు. కుర్మగూడ డివిజన్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘అంతా శివాజీలే కదా.. డూపులు ఎవరూ లేరు కదా.. పక్కా ఓటెయ్యాలి’ అంటూ నవ్వులు పూయించారు. బీజేపీకి ఓటెయ్యాలని అభ్యర్థించారు. 

Read more