11 గిన్నిస్‌ రికార్డులు సాధించిన గీతం విద్యార్థిని

ABN , First Publish Date - 2020-05-17T15:23:56+05:30 IST

చిన్నపాటి రంగు కాగితాన్ని కూడా కళాత్మకంగా మలచగల నేర్పు ఓ విద్యార్థినికి వరంగా మారింది.

11 గిన్నిస్‌ రికార్డులు సాధించిన గీతం విద్యార్థిని

హైదరాబాద్/పటాన్‌చెరు : చిన్నపాటి రంగు కాగితాన్ని కూడా కళాత్మకంగా మలచగల నేర్పు ఓ విద్యార్థినికి వరంగా మారింది. ఏకంగా విశ్వ యవనికపై విజయకేతనం ఎగురవేయడానికి తోడ్పడింది. అదీ ఏదో ఒకటీ.. రెండూ.. కాదు, ఏకంగా పదకొండు గిన్నిస్‌ రికార్డులు, 15 అసిస్ట్‌ వరల్డ్‌ రికార్డులతో పాటు ఒక యూనిక్‌ వరల్డ్‌ రికార్డు.


గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని బీటెక్‌ (సీఎస్ఈ) నాలుగో ఏడాది విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాత్సవ, ఆమె తల్లి కవితా జోహ్రి శ్రీవాత్సవ, తండ్రి అనిల్‌ శ్రీవాత్సవతో ఇప్పటివరకు పదకొండు గిన్నిస్‌ రికార్డులను నెలకొల్పారు. ఒకే కుటుంబానికి పదకొండు గిన్నిస్‌ రికార్డులు రావడం కూడా మరో రికార్డుగా వినుతికెక్కడం విశేషం.


ఈ సందర్భంగా గిన్నిస్‌ రికార్డులను సాధించిన శివాలి, ఆమె తల్లిదండ్రులను గీతం హైదరాబాద్‌ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎన్‌.శివప్రసాద్‌, రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎ్‌సఆర్‌ వర్మ, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.సీతారామయ్య, స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జీఏ రామారావు, స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీఎస్‌ కుమార్‌, స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సునీల్‌ కుమార్‌, విద్యార్థి వ్యవహారాల సంచాలకుడు ప్రొఫెసర్‌ ఎ.రామ్‌, గణిత విభాగం అధ్యాపకుడు డాక్టర్‌ మల్లికార్జున్‌, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.

Updated Date - 2020-05-17T15:23:56+05:30 IST