సుస్థిర ప్రకృతి ఇంధనం రాష్ట్ర కార్యదర్శిగా వెంకటనారాయణరెడ్డి

ABN , First Publish Date - 2020-08-18T09:50:20+05:30 IST

గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, సుస్థిర ప్రకృతి ఇంధ నం రాష్ట్ర కార్యదర్శిగా మారం వెంకటనారాయణరెడ్డి నియమితులయ్యారు.

సుస్థిర ప్రకృతి ఇంధనం రాష్ట్ర కార్యదర్శిగా వెంకటనారాయణరెడ్డి

ముషీరాబాద్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, సుస్థిర ప్రకృతి ఇంధ నం రాష్ట్ర కార్యదర్శిగా మారం వెంకటనారాయణరెడ్డి నియమితులయ్యారు. సోమవారం ఆయనకు గాంధీ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ గున్నా రాజేందర్‌రెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి నుంచి వచ్చే వ్యర్థాలను గోబర్‌ గ్యాస్‌ విద్యుత్‌ శక్తి ఇంధనాలుగా వాడుకోవడానికి కావాల్సిన విజ్ఞానాన్ని గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ సంస్థల నుంచి ప్రజలకు అందించడానికి సుస్థిర విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి నుంచి వచ్చే వ్యర్థాలను గ్లోబల్‌ గ్యాస్‌, విద్యుత్‌ శక్తిని వాడుకునేలా కమిటీని వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గాంధీసంస్థల ప్రధానకార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-18T09:50:20+05:30 IST