రేపటి నుంచి ఎంబీబీఎస్ బోధనా తరగతులు
ABN , First Publish Date - 2020-12-15T05:52:03+05:30 IST
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌లో ఈ నెల 16 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ వికా్‌సభాటియా
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌లో ఈ నెల 16 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ వికా్‌సభాటియా తెలిపారు. సోమవారం రాత్రి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొవిడ్-19 కారణంగా ఇప్పటికే ఆలస్యమైనందున కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థుల వసతి కోసం హాస్టల్ గదులను, పరిసరాలను శుభ్రం చేసి ఉంచామన్నారు. ఆయన వెంట ఆఫీసర్ ఇన్‌చార్జీ డాక్టర్ శ్యామల ఉన్నారు.