‘కొవిడ్ రోగులకు ఆరీఫ్ ఆస్పత్రిలో ఉచిత సేవలు’
ABN , First Publish Date - 2020-09-14T09:48:49+05:30 IST
కొవిడ్ రోగులకు ఉచిత చికిత్సతోపాటు ఆక్సిజన్, భోజనం అందిస్తున్నామని ఆల్ ఆరీఫ్ జనరల్ ఆస్పత్రి, యునాని
చార్మినార్, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ రోగులకు ఉచిత చికిత్సతోపాటు ఆక్సిజన్, భోజనం అందిస్తున్నామని ఆల్ ఆరీఫ్ జనరల్ ఆస్పత్రి, యునాని ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ తౌఫిక్ అహ్మద్ తెలిపారు. చాంద్రాయనగుట్ట బండ్లగూడలోని ఆస్పత్రి సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అవకాశాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొవిడ్ బారినపడ్డ వారిని ఆదుకునేందుకు ఐకేర్ చారిటబుల్ ట్రస్ట్, ఉమ్మా గ్రూప్ ఆధ్వర్యంలో 24 గంటల పాటు ఉచిత సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉబెద్ షరీఫ్, డాక్టర్ తన్‌జీల్ మున్నవర్, ఖర్మోషి గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ మోసిన్ ఖర్మోషి, డాక్టర్ మతీన్‌ఉద్దీన్ సలీం తదితరులు పాల్గొన్నారు.