గుడికి వెళ్లొస్తానని చెప్పి.. పిల్లల్ని పక్కింటోళ్లకు అప్పగించిన ఆమె తిరిగిరాకపోవడంతో..
ABN , First Publish Date - 2020-08-12T14:42:56+05:30 IST
చెవి రింగులు కొనుక్కుంటానని వెళ్లిన తన కుమార్తె అదృశ్యమైందని ఓ తల్లి మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూబోయినపల్లికి చెందిన కవిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆదయ్యనగర్‌లో నివసిస్తోంది.

వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి అదృశ్యం
రెజిమెంటల్ బజార్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): చెవి రింగులు కొనుక్కుంటానని వెళ్లిన తన కుమార్తె అదృశ్యమైందని ఓ తల్లి మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూబోయినపల్లికి చెందిన కవిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆదయ్యనగర్‌లో నివసిస్తోంది. ఆదివారం తన కుమార్తె అలేఖ్య (15) చెవి రింగులు కొనుకుంటానని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని, తెలిసిన వారు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో మంగళవారం మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మహేష్ తెలిపారు.
ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి ..
ఆస్పత్రికని వెళ్లిన తన తండ్రి తిరిగి ఇంటికి రాలేదని ఓ కుమారుడు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సికింద్రాబాద్ అశోక్‌నగర్‌కు చెందిన బాగడి గణేష్ (43) ఈనెల 11వ తేదీన ఆస్పత్రికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన అతడి కుమారుడు మార్కెట్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మహేష్ తెలిపారు.
గుడికి వెళ్లిన గృహిణి ..
గుడికి వెళ్లి వస్తానని తన ఇద్దరు పిల్లలను పొరుగు వారికి అప్పగించి వెళ్లిన గృహిణి తిరి గి రాలేదు. సూరారంలోని రాజీవ్‌గృహకల్పకు చెందిన సీహెచ్. దీనబంధు భార్య దివ్య (23) ఈ నెల 10న ఉదయం 10.30 గంటలకు గుడికి వెళ్లి వస్తానని తన ఇద్దరు పిల్లలను ఇంటి పక్కన ఉన్న వారికి అప్పగించి వెళ్లింది. తిరిగి ఆమె సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె భర్త తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో మంగళవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పురుషోత్తం అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నల్లగండ్లలో యువతి
ఇంటి నుంచి బయటకెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ ఘటన చందానగర్ ఠాణా పరిధిలో జరిగింది. నల్లగండ్లలో నివాసం ఉండే శివప్ప కుమార్తె సువర్ణ(19) గొంతులో నొప్పిగా ఉందని మెడికల్ షాపునకు వెళ్లి మందులు తెచ్చుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.