27న సుస్థిర విద్యా విజ్ఞాన కేంద్రం భవనానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2020-09-24T09:04:41+05:30 IST

ఇబ్రహీంపట్నం వినోభానగర్‌ గ్రామంలో ఈ నెల 27వ తేదీన సుస్థిర విద్యా విజ్ఞాన కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన

27న సుస్థిర విద్యా విజ్ఞాన కేంద్రం భవనానికి శంకుస్థాపన

ముషీరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం వినోభానగర్‌ గ్రామంలో ఈ నెల 27వ తేదీన సుస్థిర విద్యా విజ్ఞాన కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు గాంధీ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ గున్నా రాజేందర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ పై శిక్షణ ఇచ్చేందుకు ఈ భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. బుధవారం విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి శంకుస్థాపనకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, మధు, గిరిధర్‌గౌడ్‌, మల్లికార్జున్‌, భాస్కర్‌రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T09:04:41+05:30 IST