శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు లైఫ్ వైరో ‘ట్రీట్’మెంట్
ABN , First Publish Date - 2020-09-12T09:44:08+05:30 IST
కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబా టులోకి రాలేదని నైపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యు ..

బాలానగర్, సెప్టెంబర్ 11(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబా టులోకి రాలేదని నైపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యు కేషన్‌అండ్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ డా.శశిబాలాసింగ్ అన్నా రు. కరోనా, శ్వాసకోశ వైరస్‌ల నుంచి ఉపశమనం పొందేం దుకు నైపర్, లైఫ్ ఆక్టీవస్, సుప్రీం ఇండస్ట్రీస్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన లైఫ్‌వైరో ట్రీట్, న్యూబోలైజర్, రిలీఫ్ డ్రాప్స్ పనితీరును శుక్రవారం మీడియాకు వివరిం చారు.
ఈ సందర్భంగా శశిబాలాసింగ్, సుప్రీం డైరెక్టర్ కేశవ డియో, డా. డి. పంచసార మాట్లాడుతూ నైపర్ సైంటిఫిక్ టీం డా. ధర్మేంద్రఖాత్రీ, డా. పంకజ్, డా. నందకుమార్, డా. రాహుల్ లైఫ్‌వైరో ట్రీట్‌కు కావలసిన ఫార్ములాను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ మం దున్యూఢిల్లీ డీసీజీఐ అనుమతి కోసం పరిశీలనలో ఉందని వివరించారు. ఈ లైఫ్‌వైరో ట్రీట్ ప్రజలకు అందుబాటు ధర లో ఉండడంతోపాటు శ్వాసకోశ వైరల్ ఇన్‌ఫెక్షన్‌పై గట్టిగా పనిచేస్తుందన్న ధీమాను వారు వ్యక్తం చేశారు.