‘పవర్‌స్టార్‌’ పోస్టర్‌ అంటించినందుకు.. ఆర్‌జీవీకి రూ.4 వేల జరిమానా

ABN , First Publish Date - 2020-07-28T16:21:13+05:30 IST

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. ఆయన తాజా చిత్రం ‘పవర్‌స్టార్‌’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకుగాను జీహెచ్‌ఎంసీ

‘పవర్‌స్టార్‌’  పోస్టర్‌ అంటించినందుకు.. ఆర్‌జీవీకి రూ.4 వేల జరిమానా

జూబ్లీహిల్స్‌లోని  అడ్రస్‌కు చలానా పంపిన జీహెచ్‌ఎంసీ  


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి):  ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. ఆయన తాజా చిత్రం ‘పవర్‌స్టార్‌’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకుగాను జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెట్‌ సెల్‌ ఆయన రూ.4,000 చెల్లించాలని పేర్కొంటూ చలానా జారీ చేసింది. లాక్‌డౌన్‌ అనంతరం మొదటి పోస్టర్‌, మొబైల్‌ యాప్‌లో విడుదలయ్యే సినిమాకూ సంబంధించి ఫస్ట్‌పోస్టర్‌ అంటూ ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ చేసిన పోస్ట్‌ను ఓ నెటిజన్‌ సీఈసీ- ఈవీడీఎం ఖాతాకు జోడిస్తూ ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు ఈ నెల 22న ఈ మేరకు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌లో అంటించిన రెండు పోస్టర్లకు గాను ఒక్కో దానికి రూ.2 వేల చొప్పున రూ.4 వేలు జరిమానా వేశారు. చలానాను జూబ్లీహిల్స్‌, గాయత్రిహిల్స్‌లోని  ఆర్‌జీవీ అడ్రస్ కు పంపనున్నట్టు ఈవీడీఎం వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2020-07-28T16:21:13+05:30 IST