ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం

ABN , First Publish Date - 2020-08-01T10:38:43+05:30 IST

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌ అల్లాదుర్గం ముస్సాలంకు చెందిన గాజుల సునీల్‌ శామ్‌సంగ్‌

ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం

రాంనగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌ అల్లాదుర్గం ముస్సాలంకు చెందిన గాజుల సునీల్‌ శామ్‌సంగ్‌ కంపెనీలో వాషింగ్‌ మెషిన్‌, ఫ్రిజ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. దమ్మాయిగూడలో ఉన్న తన ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో కూకట్‌పల్లిలో 2019లో ఓపెన్‌ ల్యాండ్‌ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆరు నెలల నుంచి ఆందోళనలో ఉన్నాడు. వారం రోజుల క్రితం పాత నల్లకుంటలో ఉంటున్న అతడి భార్య మధురవాణి నాయనమ్మ మణెమ్మ ఇంటికి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో విపరీతంగా మద్యం తాగిన సునీల్‌.. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు.


భార్యాపిల్లలు ఓ గదిలో, అతడు మరో గదిలో నిద్రపోయారు. మణెమ్మ అతడు నిద్రపోయిన గది తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. సునీల్‌ను పిలిచినా స్పందించలేదు. మనవరాలు మధురవాణితో కలిసి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా సునీల్‌ ఫ్యాన్‌ హుక్‌కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతడిని కిందకు దించి మధురవాణి పక్కనే ఉంటున్న తన తండ్రి యాదగిరికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. ఆయన వెంటనే అక్కడికి చేరుకొని 108కి సమాచారం ఇచ్చాడు. అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి పరిశీలించగా చనిపోయి ఉన్నాడు. మధురవాణి ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-01T10:38:43+05:30 IST