వాలెంటైన్స్‌ డేను ప్రభుత్వం నిర్వహించాలి : జెరూసలెం మత్తయ్య

ABN , First Publish Date - 2020-02-12T09:13:39+05:30 IST

ప్రేమికుల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అఽధికారికంగా నిర్వహించాలని పలు సం ఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

వాలెంటైన్స్‌ డేను ప్రభుత్వం నిర్వహించాలి : జెరూసలెం మత్తయ్య

బర్కత్‌పుర, ఫిబ్రవరి11 (ఆంధ్రజ్యోతి) : ప్రేమికుల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అఽధికారికంగా నిర్వహించాలని పలు సం ఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ప్రేమికుల దినోత్సవాన్ని అడ్డుకుంటామని బజరంగ్‌దళ్‌ వంటి మతోన్మాద సంస్థలు ప్రకటించడం అప్రజాస్వామికమని, ప్రేమికులు నిర్భయంగా తమ వేడుకలు జరుపుకోవాలని, తాము పూర్తిగా అండగా ఉం టామని వారు భరోసా ఇచ్చారు.


మంగళవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షుడు జెరూసలెం మత్తయ్య మాట్లాడుతూ ఈ నెల 14న (ప్రేమికుల దినోత్సవం రోజు న) జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏ ఒక్క మున్సిపల్‌ పార్కును మూసివేసినా సహించేది లేద ని హెచ్చరించారు. ఈ విషయ మై డీజీపీ, హోంశాఖ మంత్రికి వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. ప్రేమికుల దినోత్స వం జరుపుకోవడం వల్ల కుల రహిత సమాజాన్ని నిర్మించుకోవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వాలెంటైన్స్‌ డే బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలు సంఘాల నేతలు ఏసుదాసు, ప్రవీణ్‌, విజయకుమార్‌, అఖిల్‌, హరిత, స్నేహ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-12T09:13:39+05:30 IST