బాగ్‌లింగంపల్లిలో అపార్ట్‌మెంట్ గోడలకు పగుళ్లు.. కుంగిన పిల్లర్లు
ABN , First Publish Date - 2020-10-14T19:04:59+05:30 IST
భారీ వర్షాల వల్ల బాగ్‌లింగంపల్లిలోని హెచ్‌ఐజీ-2, బ్లాక్ 21లో హౌసింగ్ బోర్డు నిర్మించిన అపార్ట్‌మెంట్ పిల్లర్లు ఫీటు లోతు కుంగిపోయాయి. గోడలు, పిల్లర్లు పగుళ్లు ఇచ్చాయి

భూమిలో ఫీటు లోతు కుంగిన పిల్లర్లు
రాంనగర్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల వల్ల బాగ్‌లింగంపల్లిలోని హెచ్‌ఐజీ-2, బ్లాక్ 21లో హౌసింగ్ బోర్డు నిర్మించిన అపార్ట్‌మెంట్ పిల్లర్లు ఫీటు లోతు కుంగిపోయాయి. గోడలు, పిల్లర్లు పగుళ్లు ఇచ్చాయి. అపార్ట్‌మెంట్ కూలిపోతుందేమోనని అందులో నివసించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అపార్ట్‌మెంట్ ప్రమాదకరంగా ఉందని అధికారులు గతంలో నోటీసులు ఇవ్వడంతో అందులో నివసిస్తున్న 12 కుటుంబాల్లో సగం మంది ఖాళీ చేశారు. అందరినీ ఖాళీ చేయించాలని జీహెచ్‌ఎంసీ సర్కిల్ డీఎంసీ ఉమాప్రకాష్, ఏసీపీ పావని, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డికి అపార్ట్‌మెంట్ వాసులు గతంలో విన్నవించినా చర్యలు తీసుకోలేదు. అపార్ట్‌మెంట్ నిర్మించి 20 ఏళ్లు కాకముందే పిల్లర్లు కుంగిపోవడం, గోడలు పగుళ్లు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోందని ఓ ఫ్లాట్ యజమాని రమేష్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.