జేఎన్‌టీయూలో ఎఫ్‌డీపీ సదస్సు ప్రారంభం
ABN , First Publish Date - 2020-07-10T09:51:58+05:30 IST
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్స్‌స్

జేఎన్‌టీయూ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్స్‌స్ విభాగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు జేఎన్‌టీయూహెచ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటుచేశామని సెంటర్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఆర్. శ్రీదేవి తెలిపారు. సీవోఈ జేఎన్‌టీయూహెచ్, ఐఎ్‌సఈఏ సంయుక్తాధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్స్‌స్ అంశంపై రెండురోజులపాటు నిర్వహించనున్న ఎఫ్‌డీపీ సదస్సు గురువారం ప్రారంభమైంది. సదస్సులో సెంటర్ సీఈవో డాక్టర్ శ్రీరామ్ బిరదవోలు, సహాయ డైరెక్టర్ ఎం. కృష్ణ, లక్ష్మీఈశ్వరి, అంజన, 500 మంది అధ్యాపకులు పాల్గొంటున్నట్లు శ్రీదేవి పేర్కొన్నారు.