కుమార్తెపై తండ్రి అత్యాచారం

ABN , First Publish Date - 2020-06-18T10:03:47+05:30 IST

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

కుమార్తెపై తండ్రి అత్యాచారం

దుండిగల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సూరారంలో నివాసముండే ఓ పెయింటర్‌ తన 14 ఏళ్ల కూతురిని బెదిరించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ఆరు నెలల గర్భం దాల్చింది. తల్లి ప్రశ్నించడంతో ఈ దురాగతం వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు తండ్రికి దేహశుద్ధి చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు పోక్సో చట్టం కింద తండ్రిపై కేసు నమోదు చేశారు.  

Updated Date - 2020-06-18T10:03:47+05:30 IST