పవన్‌కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో..అసత్య ప్రచారాలు
ABN , First Publish Date - 2020-09-16T07:35:15+05:30 IST
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు

చర్యలు తీసుకోవాలని జనసేన నేతల ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారం రాజలింగం సీసీఎస్ సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్మీనరసింహస్వామి వారి రథం ధ్వంసం చేశారు.
ఆ ఘటనను వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణ దీక్షను చేపట్టి జ్యోతి వెలిగించిన చిత్రాలను ట్విటర్, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కొంతమంది ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రతికూలంగా మార్చి పోస్ట్ చేశారు. ఇలాంటి పోస్టుల ద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతినడమే కాకుండా జనాదరణ పొందిన నేతను కించ పరిచే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.