హైదరాబాద్ : చదివింది పదే.. డాక్టర్‌ వృత్తి చేస్తూ బుక్కయ్యాడు!

ABN , First Publish Date - 2020-07-19T17:48:26+05:30 IST

ఇదిగో పక్కన ఉన్న ఫొటోలో ఉన్న యువ డాక్టర్‌ను చూడండి..! ఆ సూటు, బూటు.. పక్కనే కారు చూడగానే అచ్చు గుద్దినట్లుగా డాక్టర్‌లాగా ఉన్నాడు కదూ..

హైదరాబాద్ : చదివింది పదే.. డాక్టర్‌ వృత్తి చేస్తూ బుక్కయ్యాడు!

హైదరాబాద్ : ఇదిగో పక్కన ఉన్న ఫొటోలో ఉన్న యువ డాక్టర్‌ను చూడండి..! ఆ సూటు, బూటు.. పక్కనే కారు చూడగానే అచ్చు గుద్దినట్లుగా డాక్టర్‌లాగా ఉన్నాడు కదూ.. ఆయన పేరుకే డాక్టర్.. ఎక్కడా ఎంబీబీఎస్ చదివింది లేదు పాడు లేదు. చదివింది పదో తరగతే అయినా ఫేక్ సర్టిఫికెట్లతో పేద్ద డాక్టర్‌గా అవతారమెత్తి అమయాకులను మోసం చేస్తున్నాడు. అయితే ఈ విషయం బయటికి ఎలా పొక్కిందో గానీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా ఈ ఫేక్ డాక్టర్‌ను పట్టేసుకున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్‌ పనిచేస్తున్నాడని పక్కా సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు.


అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫేక్ సర్టిఫికెట్‌తో డాక్టర్‌గా అవతారం ఎత్తిన ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన పది వరకే చదివి ఫేక్‌ సర్టిఫికెట్లతో ఇలా డాక్టర్‌ అయ్యాడని తెలుసుకున్న పోలీసులు, జనాలు విస్తుపోయారు. ఆ నకిలీ డాక్టర్‌తో పాటు ఆస్పత్రి యజమాని షోహెబ్‌ను కూడా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన యజమాని, ఫేక్ డాక్టర్ వద్ద నకిలీ సర్టిఫికేట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అసలు వీరికి సర్టిఫికేట్స్ ఎవరు ఇచ్చారు..? ఏ యూనివర్శిటి అయినా డబ్బులకు ఇలా సర్టిఫికెట్స్ ఇచ్చిందా..? లేకుంటే టెక్నాలజీ సాయంతో ఇలా మార్చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - 2020-07-19T17:48:26+05:30 IST