నేడు కలెక్టరేట్‌లో సర్టిఫికెట్ల పరిశీలన
ABN , First Publish Date - 2020-05-29T09:24:40+05:30 IST
రంగారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న 71 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయనున్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : రంగారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న 71 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటలకు పరిశీలిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలుకు హాజరు కావాలని కలెక్టర్ అమయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల కోసం వెబ్‌సైట్ లో పొందుపర్చామని తెలిపారు.