ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2020-09-03T10:13:54+05:30 IST

ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి

కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు 


జవహర్‌నగర్‌, సెప్టెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు   పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లోని అంబేడ్కర్‌నగర్‌ ప్రాథమిక పాఠశాలలో 5వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఏకే మురుగేశ్‌ ఆధ్వర్యంలో హరితహరం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కలెక్టర్‌, మేయర్‌ కావ్య, డిప్యూటీ మేయర్‌ ఆర్‌ఎస్‌. శ్రీనివాస్‌, తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నేతి మంగమ్మ హాజరయ్యారు. స్థానిక కార్పొరేటర్‌లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అడవుల విస్తీర్ణం ప్రస్తుతం 7.8శాతం ఉందని దానిని 13శాతం పెంచేందుకు ప్రణాళికలు సిద్ధ్దం చేశామన్నారు.


ఇప్పటికే జిల్లాలో 3.5కోట్ల మొక్కలు నాటామన్నారు. పర్యావరణ రక్షణకు మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జవహర్‌నగర్‌ అధ్యక్షుడు కొండల్‌ ముదిరాజ్‌, కార్పొరేటర్‌లు, కో-ఆప్షన్‌ సభ్యులు, అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు. కాగా జవహర్‌నగర్‌ ప్రెస్‌క్లబ్‌కు శాశ్వత భవనం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ఆ క్లబ్‌ అధ్యక్షుడు మండల సురేందర్‌, ప్రతినిధులు ఆకుల కృష్ణ, శంకర్‌, పాండరి, భవాణిశంకర్‌, రమేశ్‌, శ్రీనివాస్‌, యాదగిరి, విజయ్‌లు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.  

Updated Date - 2020-09-03T10:13:54+05:30 IST