ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ABN , First Publish Date - 2020-06-26T09:43:44+05:30 IST
హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
మేడిపల్లిలో మొక్కలు నాటిన మంత్రి మల్లారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి
బోడుప్పల్, జూన్ 25 : హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 6వ విడత హరితహారంలో భాగంగా మేడిపల్లిలో నిర్మాణంలో ఉన్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహే్‌షభగవత్, అదనపు కలెక్టర్ శ్యాంసన్, అదనపు సీపీ సుధీర్‌బాబు, డీసీపీ రక్షితామూర్తి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
కోటి చింతచెట్లు పెంచుతాం : సబితారెడ్డి
దిల్‌సుఖ్‌నగర్ జోన్‌బృందం: హరితహారంలో భాగంగా ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా కోటి చింత చెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు మొక్కలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పి.సబితారెడ్డి తెలిపారు. బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లోని 18వ వార్డు బాలాపూర్-బడంగ్‌పేట్ లింకు రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి మొక్కలు నాటారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, బడంగ్‌పేట్ మేయర్ పారిజాతానర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ శేఖర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. మీర్‌పేట్ కార్పొరేషన్‌లోని మంత్రాల చెరువు కట్టపై మేయర్ దుర్గాదీ్‌పలాల్‌చౌహాన్, పురపాలక సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ విక్రమ్‌రెడ్డి మొక్కలు నాటారు. ఆటోనగర్‌లోని మహావీర్ హరిణ వనస్థలిలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఫారెస్టు రేంజ్ అధికారి రవీందర్‌రెడ్డి, కార్పొరేటర్లు మొక్కలు నాటారు.
అమీర్‌పేట: సనత్‌నగర్ డివిజన్‌లోని బల్కంపేట శ్మశాన వాటికలో మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. అనంతరం ఆధునిక హంగులతో నిర్మిస్తున్న గ్రేవ్‌యార్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన శాఖ పిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకే్‌షకుమార్, తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సిటీ: పర్యావరణ హితం- సైబరాబాద్ పోలీసుల అభిమతం అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. గురువారం ఒక్కరోజే మొత్తం 2,198 మొక్కలు నాటినట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ క్రైమ్స్ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ డీసీపీ కార్‌హెడ్ క్వార్టర్స్ మాణిక్‌రాజ్, గౌస్‌మొయినుద్దిన్, అడిషనల్ డీసీపీ ఇందిర, ఏసీపీ, ఆర్‌ఐలు పాల్గొన్నారు.
హైదరాబాద్ సిటీ/బేగంపేట/ మారేడుపల్లి/బౌద్ధనగర్/తార్నాక: హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఈ సారి 5లక్షల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. బేగంపేటలోని మెట్రో రైలు భవన్, మెట్రో కారిడార్‌లలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో మెట్రో ఇంజనీర్లు పాల్గొన్నారు. బేగంపేట పాటిగడ్డలో కార్పొరేటర్ ఉప్పల తరుణి మొక్కలు నాటారు. తార్నాక కార్పొరేటర్ ఆలకుంట సరస్వతితో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లాలాపేట్‌లోని ప్రొ.జయశంకర్ స్టేడియంలో మొక్కలను నాటారు. వెస్ట్‌మారేడుపల్లి ప్రిమెసన్స్ సెంటర్‌హాలు ప్రాంగణంలో కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, 4వ వార్డు సభ్యురాలు పి.నళిని కిరణ్‌లతో కలిసి బోర్డు సీఈఓ చంద్రశేఖర్ మొక్కలను నాటారు. బౌద్ధనగర్‌లో కార్పొరేటర్ ధనంజనగౌడ్ పార్కులో మొక్కలను నాటారు.
పేట్‌బషీరాబాద్/షాపూర్‌నగర్: కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్రా చౌరస్తా సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, జోనల్ కమిషనర్ మమత మొక్కలు నాటారు. రంగారెడ్డి నగర్ డివిజన్‌లోని ఏపీహెచ్‌బీ కాలనీలో కార్పొరేటర్ విజయశేఖర్‌గౌడ్, జీడిమెట్ల డివిజన్ అంగడిపేట ఆర్టీఐ కార్యాలయ ఆవరణలో డీటీవో ఎం.కిషన్ తదితరులతో కలిసి మొక్కలు నాటారు. సూరారం డివిజన్ వైష్ణవినగర్‌లో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మొక్కలు నాటారు.
కుషాయిగూడ/ రామంతాపూర్ : చర్లపల్లి పారిశ్రామిక వాడలో టీఎ్‌సఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీఎ్‌సఐఐసీ ఎండీ వెంకట నర్సింహా రెడ్డి, తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య అధ్యక్షుడు కె.సుధీర్ రెడ్డి, టీఎ్‌సఐఐసీ చీఫ్ ఇంజనీర్ శ్యామ్‌సుందర్, జోనల్ మేనేజర్ మాధవి, ఇండస్ట్రియల్ సర్వీస్ సొసైటీ చైర్మన్ హరీష్ రెడ్డి, రోషిరెడ్డి, విఘ్నేశ్వర్ రావు, సీఐఏ ప్రతినిధులు మొక్కలు నాటారు. హబ్సిగూడ డివిజన్ హరిజన బస్తీలో కార్పొరేటర్ స్వప్నారెడ్డి మొక్కలు నాటారు.
బాలానగర్/ఓల్డుబోయినపల్లి/ఫతేనగర్/కేపీహెచ్‌బీకాలనీ/అల్లాపూర్: కేపీహెచ్‌బీ కాలనీ వసంత్ నగర్‌లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీనివా్‌సరావు, సాయిబాబా, భవాని పాల్గొన్నారు. కార్పొరేటర్ నరేంద్రాచార్య బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా చిత్తారమ్మబస్తీ డబుల్ బెడ్రూం సముదాయాల వద్ద, ఓల్డుబోయినపల్లి కార్పొరేటర్ నర్సింహయాదవ్ బస్తీల్లో, మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ రవీందర్, ఫతేనగర్ కార్పొరేటర్ సతీ్‌షగౌడ్ భరత్‌నగర్ కాలనీలో మొక్కలు నాటారు. బాలానగర్ సీఐ వహీదుద్దీన్ ఆధ్వర్యంలో డీసీపీ మొక్కలు నాటారు. ఇండోర్ స్టేడియం ఆవరణలో అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా బేగం, మూసాపేట్ డివిజన్ పాండురంగా నగర్‌లో కార్పొరేటర్ తూము శ్రావణ్ మొక్కలు నాటారు.
ముషీరాబాద్/కవాడిగూడ/చిక్కడపల్లి/రాంనగర్ : ముషీరాబాద్, భోలక్‌పూర్, రాంనగర్, అడిక్‌మెట్ డివిజన్లలో కార్పొరేటర్లు ఎడ్ల భాగ్యలక్ష్మిహరిబాబుయాదవ్, అఖిల్ అహ్మద్, వి.శ్రీనివా్‌సరెడ్డి, బి.హేమలతారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ మొక్కలు నాటారు. దోమలగూడ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గ్రౌండ్‌లో, ఇందిరాపార్కులో, గాంధీనగర్ డివిజన్‌లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జి.లాస్యనందిత, ముఠా పద్మానరేష్, అధికారులు పాల్గొన్నారు.
ఉప్పల్/ఏఎ్‌సరావునగర్/కాప్రా: ఉప్పల్, కాప్రా సర్కిళ్లలోని పలు డివిజన్లలో, హెచ్‌బీ కాలనీ ఫేస్-2లో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సరస్వతీ సదానంద్, స్వప్నారెడ్డి, జ్యోత్స్నా నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
బంజారాహిల్స్/ఎర్రగడ్డ: హరితహారంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, సంక్షేమ సంఘాల నాయకులు మొక్కలు నాటారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కార్పొరేటర్లు కాజా సూర్యనారాయణ, గద్వాల్ విజయలక్ష్మి, మన్నె కవితారెడ్డిలతో కలిసి జూబ్లీహిల్స్, వెంకటేశ్వరనగర్‌కాలనీ, బంజారాహిల్స్ డివిజన్‌లలో మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ యూసు్‌ఫగూడ, వెంగళరావునగర్, రహ్మత్‌నగర్, షేక్‌పేట డివిజన్లలో పర్యటించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో పచ్చదనం అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేయనున్నట్టు చెప్పారు. ఎర్రగడ్డలోని రాజీవ్‌నగర్‌లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రమేష్ పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి జోన్‌బృందం: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్లు, వెస్ట్‌జోనల్ కమిషనర్ రవికిరణ్, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ మొక్కలు నాటారు. చందానగర్, గచ్చిబౌలి, కొండాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, హఫీజ్‌పేట డివిజన్లలో కార్పొరేటర్లు నవతారెడ్డి, కొమిరిశెట్టి సాయిబాబా, హమీద్‌పటేల్, రాగం నాగేందర్‌యాదవ్, జగదీశ్వర్‌గౌడ్, పూజితతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. మాదాపూర్ పోలీ్‌సస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది, గచ్చిబౌలి పీఎస్‌లో జాయింట్ సీపీ ఎ.వెంకటేశ్వరరావు, డీసీపీ వెంకటేశ్వర్లు తదితరులు మొక్కలు నాటారు. హైదర్‌నగర్ కిందికుంట చెరువు వద్ద జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే గాంధీ మొక్కలు నాటారు.
మల్కాజిగిరి/మౌలాలి/వినాయకనగర్/ఆనంద్‌బాగ్/అల్వాల్/ జవహర్‌నగర్: మల్కాజిగిరి విష్ణుపురిలోని పార్కులో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జగదీ్‌షగౌడ్, డీసీ దశరథ, ఏఈ దివ్యజ్యోతి పాల్గొన్నారు. గౌతమ్‌నగర్, మౌలాలి డివిజన్‌లలో కార్పొరేటర్లు శిరీషారెడ్డి, ముంతాజ్ ఫాతిమా మొక్కలు నాటారు. వినాయకనగర్ డివిజన్‌లో కార్పొరేటర్ పుష్పలతారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్‌లో కార్పొరేటర్ నర్సింగరావు మొక్కలను నాటారు.
అల్వాల్‌లోని ముత్యంరెడ్డి నగర్‌లో కార్పొరేటర్ శాంతిశ్రీనివా్‌సరెడ్డి, అల్వాల్ సర్కిల్‌లో కార్పొరేటర్ రాజ్‌జితేందర్‌నాథ్, వెంకటాపురం డివిజన్‌లో కానాజీగూడలో కార్పొరేటర్ సబితకిషోర్ మొక్కలను నాటారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేడ్కర్‌నగర్, రాజీవ్‌గాంధీనగర్‌తోపాటు పలు డివిజన్లలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీమేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ కార్పొరేటర్లు మొక్కలు నాటారు.
రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్లలో మొక్కలు నాటారు. ఆయా డివిజన్ల కార్పొరేటర్లు రావుల విజయా జంగయ్య, కోరని శ్రీలతా మహాత్మా, తోకల శ్రీనివా్‌సరెడ్డి, మహ్మద్ మిస్బావుద్దీన్, ఆబేదా నవాజుద్దీన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
మెహిదీపట్నం: రేతిబౌలి, పద్మనాభనగర్ కాలనీలో గ్రీన్ బెల్టులో ఎమ్మెల్సీ ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గండిపేట మండలంలో, నార్సింగ్, బండ్లగూడ, మణికొండ మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ రేఖాదేవి, వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అంబర్‌పేట/బర్కత్‌పుర/నల్లకుంట/ గోల్నాక/ కాచిగూడ: అంబర్‌పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్ కె.పద్మావతిరెడ్డి, డీఎంసీ వేణుగోపాల్, ఏఎంహెచ్‌వో డాక్టర్ హేమలతతో కలిసి మొక్కలు నాటారు. కాచిగూడ డివిజన్ నింబోలిఅడ్డలో కార్పొరేటర్ చైతన్య కన్నా, నల్లకుంట డివిజన్‌లోని మున్సిపల్ పార్కులో కార్పొరేటర్ శ్రీదేవీరమేష్, అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో కార్పొరేటర్ జగన్, గోల్నాక డివిజన్‌లో కార్పొరేటర్ పద్మావెంకటేష్ మొక్కలు నాటారు. వీరన్నగుట్ట మహాశివాలయం ప్రాంగణంలో ఎమ్మెల్యే వెంకటేష్ దంపతులు కుమారుడితో కలిసి మొక్కలు నాటారు.