రాజకీయ, ఆర్థిక సాధికారతతోనే సమానత్వం

ABN , First Publish Date - 2020-02-16T08:53:19+05:30 IST

మహిళలు రాజకీయ, ఆర్థిక సాధికారతను సాధించినపుడే మహిళలపై హింస తగ్గుతుందని వక్తలు పేర్కొన్నారు.

రాజకీయ, ఆర్థిక సాధికారతతోనే సమానత్వం

‘మహిళా సాధికారతకు సవాళ్లు’పై రౌండ్‌ టేబుల్‌లో వక్తలు 


హైదరాబాద్‌ ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మహిళలు రాజకీయ, ఆర్థిక  సాధికారతను సాధించినపుడే మహిళలపై హింస తగ్గుతుందని వక్తలు పేర్కొన్నారు. మద్యం, అశ్లీలత ను నిషేధించకుండా నిందితులకు ఉరి శిక్షలు వేసినంత మాత్రాన నేరాలు ఆగవన్నారు. భార త జాతీయ మహిళా సమాఖ్య(ఎన్‌ఎ్‌ఫఐడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం మక్దూంభవన్‌ డాక్టర్‌ రాజ్‌బహదూర్‌హాల్‌లో ‘మహిళలపై ఆగని అత్యాచారాలు-మహి ళా సాధికారతకు సవాళ్లు’ అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ఎన్‌ఎ్‌ఫఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన అధ్యక్షత వ హించారు.


ఇందులో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర నా యకురాలు ఇందిరాశోభ మాట్లాడుతూ స్వాతం త్య్రం వచ్చి 70 ఏళ్లైనా దేశంలో ఇంకా మహిళలపై హింస కొనసాగడం దురదృష్టకరమన్నారు.  విద్యావ్యవస్థలో నైతిక విలువలు నేర్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని  బెల్ట్‌షా్‌పలను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. సామాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ మహిళలకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా సమానత్వం సాధించలేమన్నారు. బీజెపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయన్నారు. పీవోడబ్ల్యూ సంధ్య మాట్లాడు తూ మహిళల విద్య, ఉపాధి కోసం ప్రభుత్వా లు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. చట్టాల్లో లొసుగుల కారణం గా నిర్భయ దోషులకు శిక్షలు అమలు కాకపోవ డం దౌర్భాగ్యమన్నారు. ఎన్‌ఎ్‌ఫఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ పోలీస్‌, న్యాయవ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించే విధంగా స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్‌ చేశారు. మద్య నిషేధం కోసం మహిళల ఐక్యపోరాటాలు అవసరమన్నారు. 


కృష్ణకుమారి మాట్లాడుతూ మహిళలు సంఘటిత, నిరంతర ఉద్యమాలు, పోరాటాల ద్వారానే తమ హక్కులు సాధించుకోవచ్చన్నారు.  కార్యక్రమం లో ఎన్‌ఎ్‌ఫఐడబ్ల్యూ రాష్ట్ర కోశాధికారి ఎన్‌.నళినిరెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు ఫహీందీ, కమలమ్మ, ఉషా, కరుణ, అశ్విని, పల్లవి, షాహేదాబేగం, లక్ష్మమ్మ, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-02-16T08:53:19+05:30 IST