‘పాక సిరి’ ఇంగ్లిషు పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2020-10-27T10:03:29+05:30 IST

అరికలు, సామలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు వంటి సిరిధాన్యాలతో తయా రు చేసే సుమా రు 130కి పైగా వంటకాలను ఎలా చేయాలో తెలిపే ‘పాక సిరి’ ఇంగ్లిషు పుస్తకాన్ని విజయదశ మిసందర్భంగా ప్రముఖ

‘పాక సిరి’ ఇంగ్లిషు పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): అరికలు, సామలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు వంటి సిరిధాన్యాలతో తయా రు చేసే సుమారు 130కి పైగా వంటకాలను ఎలా చేయాలో తెలిపే ‘పాక సిరి’ ఇంగ్లిషు పుస్తకాన్ని విజయదశ మిసందర్భంగా ప్రముఖ ఆహారవేత్త డాక్టర్‌ ఖాదర్‌వలి, ఉషా ఖాదర్‌వలి కలిసి ఆవిష్కరించారు. రైతునేస్తం పబ్లికేషన్‌ ప్రచురించిన ఈ పుస్తకం తెలుగు భాషలో అందుబాటులో ఉంది. దీనిని ఇంగ్లిషులో అనువదించడం ద్వారా ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుందని రచయితలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సిరి ధాన్యాలతో తయారైన వంటకాలను ఆస్వాదిస్తూ అందరూ ఆరోగ్యవంతులుగా జీవించాలని ఈ సందర్భంగా డాక్టర్‌ ఖాదర్‌వలి కోరారు.


Updated Date - 2020-10-27T10:03:29+05:30 IST