ఈఎంఐ చెల్లింపునకు మూడు నెలల రాయితీ ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-03-27T08:52:56+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఉపాధి కోసం వివిధ వాహనాలు కొనుగోలు చేసిన వారికి ఈఎంఐ చెల్లింపులో మూడు నెలల ప్రత్యేక రాయితీ ఇవ్వాలని తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజనాల చంద్రకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఈఎంఐ చెల్లింపునకు మూడు నెలల రాయితీ ఇవ్వాలి

ఖాళీగా ఉన్న సచివాలయంలో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయాలి

తెలంగాణ ఇంటిపార్టీ  



బర్కత్‌పుర, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఉపాధి కోసం వివిధ వాహనాలు కొనుగోలు చేసిన వారికి ఈఎంఐ చెల్లింపులో మూడు నెలల ప్రత్యేక రాయితీ ఇవ్వాలని తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజనాల చంద్రకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అన్ని సంస్థలను మూసివేయడంతో చిరు ఉద్యోగులు, వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో ట్రాలీ డ్రైవర్లు ఇంటికే పరిమితమయ్యారని, దీంతో తీసుకున్న రుణానికి వాయిదా చెల్లించలేపోతున్నారని అన్నారు.


గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పలు బ్యాంకుల నుంచి రుణం తీసుకొని ఆటోలు, కార్లు కొనుగోలు చేశారని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనిలేక ఈఎంఐ చెల్లించలేని స్థితిలో ఉన్నారని, వారిని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఖాళీగా ఉన్న సచివాలయంలో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంటిపార్టీ నాయకులు హరీష్‌, దేవేందర్‌రెడ్డి, రమే్‌షనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-03-27T08:52:56+05:30 IST